Samantha: నా జీవనశైలిలో అదొక భాగం
ABN, Publish Date - Apr 26 , 2024 | 03:21 PM
మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు సమంత(*Samanatha). అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు సమంత(Samantha). అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. పెళ్లి గౌనును (Wedding Gown)రీ మోడల్ చేయించి అవార్డుల కార్యక్రమం కోసం ఉపయోగించడం చర్చనీయాంశమైంది. ఇటీవల సామ్ ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరయ్యారు.. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ఆమె నలుపు రంగు గౌను ధరించి డయాస్‌పై సందడి చేశారు. ఈ ఫొటోలను ఇన్‌స్ట్టాలో షేర్ చేశారు. ‘‘ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్‌గా నన్ను ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించా. దీనిని అందంగా డిజైన్ చేసిన క్రేశాబజాజ్‌కు థ్యాంక్స్. నా అలవాట్లను మార్చుకోవడం, జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి’’ అని రాసుకొచ్చారు.
‘ఏమాయచేసావే’తో చిత్రంలో తొలిసారి నాగచైతన్య-సమంత కలిసి నటించారు.ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి తంతులో రామానాయుడి సతీమణి చీరను సమంత రీమోడల్ చేయించి కట్టుకున్నారు. క్రిస్టియన్ వెడ్డింగ్‌లో తెల్ల గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని ధరించారు. ఆనాటి వెడ్డింగ్ గౌనును తాజాగా సమంత నలుపు రంగులోకి మార్పి ఈ వేదికపై ధరించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన '
'ఖుషి’ చిత్రం తర్వాత సామ్ మరో సినిమా అంగీకరించలేదు. బాలీవుడ్‌లో నటించిన 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Read more: Tollywood, Telugu Cinema, Cinema News