Samantha Fire: విడాకులు తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..

ABN, Publish Date - Nov 26 , 2024 | 11:14 AM

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి సమంత తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమాజంలో మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు.

నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి సమంత (Samantha) తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమాజంలో మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఓ ఇద్దరి మధ్య బందం తెగిపోతే తప్పు ఎటువైపు ఉన్నా అమ్మాయినే నిందిస?్తరన్నారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేశారు సామ్‌. నాపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవన్నీ తట్టుకుని ఇలా ఉన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ  ‘విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్‌ తగిలిస్తుంది. ‘సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం వృథా, యూజ్డ్‌’ ఇలాంటి ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి మాటలు ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఎంతో క్షోభకు గురి చేస్తాయి. కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయిని ఇవి మరింత నిరాశ పరుస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవి అబద్థాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులు ఎంతోమంది నాకు సపోర్ట్‌గా నిలిచారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.  

అంతే కాదు సమంత పెళ్లికి ప్రత్యేకంగా తయారు చేయించిన గౌను గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘నా పెళ్లి గౌనును రీ మోడల్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఆ గౌను రీ డిజైన్‌ చేయడం ద్వారా నేను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు. దాని వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు.. నా జీవితంలో జరిగిన విషయాలను ఎప్పుడూ దాచాలనుకోలేదు. ఎన్నో కష్టమైన దశలు దాటుకొని వచ్చానంటే అది నా బలానికి ప్రతీక మాత్రమే కానీ నా జీవితం అక్కడితో ముగిసిపోయిందని కాదు. అది ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే తిరిగి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను’ అని అన్నారు.
 

Updated Date - Nov 26 , 2024 | 11:19 AM