Sai Pallavi: డాక్టర్ సాయిపల్లవి.. కార్యాచరణ తెలియాలి!
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:20 PM
నేచురల్ బ్యూటీ అంటే గుర్తొచ్చే అతి తక్కువమంది కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. ఆమె నటనలో సహజత్వం ఉట్టిపడుతుంది. దక్షిణాదిలో ఎన్ని చిత్రాలు చేసినా నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
నేచురల్ బ్యూటీ అంటే గుర్తొచ్చే అతి తక్కువమంది కథానాయికల్లో సాయిపల్లవి (Sai pallavi) ఒకరు. ఆమె నటనలో సహజత్వం ఉట్టిపడుతుంది. దక్షిణాదిలో ఎన్ని చిత్రాలు చేసినా నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కానీ గ్లామర్, రొమాన్స్ సీన్ల విషయంలో ఎక్కడా గీత దాటలేదు. ఆమె నటన కూడా పక్కింటి అమ్మాయిలాగా, మన ఇంట్లో మనిషి బీహేవ్ చేసినట్లుగా ఉంటుంది. ఆమె చాలా సందర్భాల్లో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుండేవారు. కానీ ఈమె మాత్రం రెండింటిని మేనేజ్ చేస్తూ వచ్చింది. డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఎమ్బీబీఎస్ పట్టా(Doctor Convocation) అందుకుంది. అయితే ఇది జరిగి చాలాకాలం అయినా ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.
‘ప్రేమమ్’ (Premam) అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ తదితర చిత్రాలతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. అంతే కాదు సినిమాల్లో నటించడంతోపాటు ఆమె డాక్టర్ చదవాలనే కోరికనూ నెరవేర్చుకుంది. జార్జియాలోని ఓ యూనివర్శిటీలో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగులో ‘తండేల్’, పాన్ ఇండియా సినిమా ‘రామాయణ్’ ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత సాయిపల్లవి డాక్టర్ కెరీర్ గురించి ఏమైనా క్లారిటీ రావొచ్చు. అప్పటి వరకూ వేచిచూడాల్సిందే!