Sai Pallavi: పక్కింటి అబ్బాయి చాలా మంచోడు.. తెలుగోళ్లు అంటే అంతే
ABN, Publish Date - Nov 07 , 2024 | 07:11 AM
అమరన్.. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి మేజర్ హైలెట్‌గా సాయి పల్లవి నటన నిలవగా శివ కార్తికేయన్ యాక్షన్, ఎమోషన్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డిస్ట్రిబ్యూటర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మాత సుధాకర్ రెడ్డి గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన నేషన్ ప్రైడ్ బ్లాక్‌బస్టర్ ‘అమరన్’ (Amaran). రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. అమరన్.. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఒక వైపు 'లక్కీ భాస్కర్', 'క' వంటి బ్లాక్‌బస్టర్ స్ట్రెయిట్ సినిమాల నుండి పోటీని తట్టుకొని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని తెలుగులో స్టార్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డిస్ట్రిబ్యూటర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మాత సుధాకర్ రెడ్డి గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శివకార్తికేయన్ తో పాటు హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పాల్గొన్నారు. ఈ వేడుకలో సాయి పల్లవి మాట్లాడుతూ.. "శివకార్తీకేయున్ ను తమిళంలో పక్కింటి అబ్బాయ్ అని పిలుస్తారు. అలాగే అమరన్ సినిమాలో అద్భుతంగా నటించి టాలీవుడ్ లో మన ఇంటి అబ్బయ్ అయ్యాడు. నిన్న అయన నాతో మాట్లాడుతూ తమిళ్ లో నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నీతో వచ్చింది అని అన్నారు. ఈ వేదికపై చెప్తున్నాను ఆయనకు తమిళ్ లోనే కాదు తెలుగులో బ్లాక్ బస్టర్ కూడా నాతోనే రావడం చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత శివ కార్తికేయన్ సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అవుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకు అంటే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా వస్తే అది ఏ హీరో సినిమా, ఏ ఇండస్ట్రీ అనేది చూడరు, ఇటీవల తమిళ్ హీరో సూర్య వచ్చినప్పుడు ఇక్కడి వాళ్ళు ఎంతో ప్రేమ చూపించారు, అంత మంచోళ్ళు టాలీవుడ్ ప్రేక్షకులు” అంటూ ముగించారు. ఈ సినిమాకి మేజర్ హైలెట్‌గా సాయి పల్లవి నటన నిలవగా శివ కార్తికేయన్ యాక్షన్, ఎమోషన్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.