Sai Durga Tej: తన్వీ అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చా.. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో ఆ సినిమా మిస్‌ అయ్యింది

ABN, Publish Date - Jul 29 , 2024 | 01:50 PM

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి చిత్రాల ద‌ర్శ‌కుడు కె.విజ‌య్ భాస్క‌ర్ తాజాగా తెర‌కెక్కిన చిత్రం ఉషా ప‌రిణ‌యం. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విశేషాలివి.

Usha Parinayam

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్ భాస్క‌ర్ (Vijaya Bhaskar K) ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ఉషా ప‌రిణ‌యం (Usha Parinayam) అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్ (sree kamal), తన్వీ ఆకాంక్ష (Tanvi Akaanksha), సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విశేషాలివి.

దర్శకుడు విజయ్‌ భాస్కర్ (Vijaya Bhaskar K) మాట్లాడుతూ 'సాయి ద రియల్‌హీరో.. సాయి దుర్గ తేజ్‌ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో ఉన్నాడో.. ఈ రోజు అలాగే ఉన్నాడు, చిరంజీవి గారి దగ్గర ఉన్న ప్రేమ సాయిలో కనిపించింది. మా టీమ్‌ను ఎంకరైజ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సతీష్‌ ఫోటోగ్రఫీ ఈసినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. తన్వీ చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బందైనా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌ కూడా ఎంతో ఓన్‌ చేసుకుని ఈ సినిమా చేశారు' అన్నారు.

హీరో శ్రీకమల్‌ (sree kamal) మాట్లాడుతూ 'అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్‌ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాం. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నాన్న గారి పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్‌ నో ప్రాబ్లమ్‌ గర్ల్‌. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.


హీరోయిన్‌ త్వాన్వీ ఆకాంక్ష (Tanvi Akaanksha). మాట్లాడుతూ 'సాయి దుర్గ తేజ్‌ అన్న రావడం చాలా సంతోషంగా ఉంది. నేను సక్సెస్‌ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు మా నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్‌ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమా తీరింది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్‌లో మంచి నటుడు, డ్యాన్సర్ ఉన్నాడు. ఈ సినిమాను అందరూ చాలా ఎంజాయ్‌ చేస్తారు. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) మాట్లాడుతూ 'తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వలో నేను ప్రేమకావాలి (Vijaya Bhaskar K) అనే సినిమా చేయాల్సింది అది మిస్‌ అయ్యింది. ఆది సాయికుమార్‌ నా రేయ్‌ చేయాలి.. ఆది ప్రేమకావాలి చేశాడు. నేను రేయ్‌ చేశాను. అలా మారిపోయింది. కమల్ (sree kamal) నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్‌. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా ఉంది. ఆర్‌.ఆర్‌.ధ్రువన్ (RR Dhruvan) సంగీతం చాలా బాగుంటుంది. ఆల్‌ దబెస్ట్‌ . నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్‌ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్‌ తన్వీ (Tanvi Akaanksha). తన్వీ మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసి ఈ అవకాశం పొందింది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్‌భాస్కర్‌ గారికి మంచి విజయా చేకూరాలి' అన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 02:19 PM