SJ Suryah: దీనమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది..

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:42 PM

నటుడు ఎస్ జె సూర్య సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. రెండు సన్నివేశాలు.. మూడు రోజులపాటు చుక్కలు చూపించాయని అయన పేర్కొన్నారు.. ఇంతకీ అవేంటో అనుకుంటున్నారా..

రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కియారా అడ్వాణీ (Kiara adwani) కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఎస్‌జే సూర్య (SJ Suryah), శ్రీకాంత్‌, అంజలి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డబ్బింగ్‌ పూర్తి చేసినట్లు నటుడు ఎస్‌జే సూర్య పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశారు.

‘‘ఇప్పుడే డబ్బింగ్‌ పూర్తయింది. ‘గేమ్‌ ఛేంజర్‌’లోని రెండు కీలక సన్నివేశాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఒకటి గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌గారు, మరొకటి శ్రీకాంత్‌గారితో నేను చేసిన రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్‌ చెప్పడానికి మూడు రోజుల సమయం పట్టింది. ఇక అవుట్‌ పుట్‌ చూేస్త.. ‘దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్‌లో సినిమా చూేస ప్రేక్షకుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్‌ చేస్తాడు. ‘పోతారు మొత్తం పోతారు’ ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్‌, నిర్మాత దిల్‌ రాజుకు ధన్యవాదాలు. ‘రామ్‌’పింగ్‌ సంక్రాంతికి కలుద్దాం’’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం  విడుదల కానుంది. 

Updated Date - Nov 21 , 2024 | 05:42 PM