KCR: రజినీకాంత్ 'కేసిఆర్' గురించి ఏమన్నారో చూడండి.. హరీష్ రావు
ABN, Publish Date - Nov 18 , 2024 | 10:03 PM
బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు.. 'రాకింగ్ రాకేష్' హీరోగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన స్పీచ్‌తో సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఆయన ఏమన్నారంటే..
రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) హీరోగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాని నవంబర్ 22న రిలీజ్ చేయనుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే..
హరీష్ రావు మాట్లాడుతూ.. "కేసిఆర్ అంటే ఒక చరిత్ర. కేసిఆర్ తెలంగాణ ను సాధించడమే కాదు 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అనేవారు.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేదా న్యూయార్క్‌లో ఉన్నానా అని. అలాగే కేసిఆర్ పల్లెలను అభివృద్ధి చేశారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు హైదరాబాద్ ని భౌతికమైన అభివృద్దే కాదు సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణా ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు కేసిఆర్ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసిఆర్ చేసిన కృషి. ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు పోతు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసిఆర్" అంటూ ఆయన మాట్లాడిన స్పీచ్‌తో సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది.