RGV: కిక్కెక్కించి.. దించేసిన ఆర్జీవీ

ABN, Publish Date - Oct 11 , 2024 | 01:59 PM

ఆర్జీవీ ఏ సినిమా అనౌన్స్ చేసిన.. ఎదో ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ హోప్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం కూడా సినీ అభిమానులకి ఒకేసారి కిక్కేంచి.. దించేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.

RGV

భారత సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు ఆర్జీవీ (RGV) స్థానం మాత్రం సుస్థిరం. ఒక మూస పద్దతిలో సినిమాలో చేస్తున్న తెలుగు ఇండస్ట్రీలో సైకిల్ చైన్ పట్టి 'శివ'తో షేక్ చేశాడు. 'సత్య' సినిమాతో బాలీవుడ్‌ని హడలెత్తించాడు. ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమాలు తీస్తున్న భారతీయ సినీ ఇండస్ట్రీలోని అతికొద్దమంది లెజెండరీ డైరెక్టర్స్‌లో ఆయన పేరు సుస్థిరం. ఇప్పటికీ ఆయన ఏ సినిమా అనౌన్స్ చేసిన.. ఎదో ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ హోప్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం కూడా సినీ అభిమానులకి ఒకేసారి కిక్కెక్కించి.. దించేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.


ఎప్పుడైతే పాన్ ఇండియన్ సినిమాల హవా మొదలైందో అప్పుడే లాంగ్వేజ్ బ్యారియర్స్ తెగిపోయాయి. ప్రతి ఇండస్ట్రీలోని నటులు ఇతర ఇండస్ట్రీలోకి పరిచయమవడమే కాకుండా విశేషదారణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యుత్తమ నటుడిగా పేరుపొందారు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ (fahadh faasil). అయితే ఈ కథకి అర్జీవికి లింక్ ఏంటి అంటారా ఉంది కిక్కు ఏక్కించేంత ఉంది. ఫహద్ ఫాసిల్‌ని ఒక షాట్ తీసి తన 'X' ఖాతాలో ఆర్జీవీ షేర్ చేస్తూ.. "నేను ఫహద్‌ని తీసిన ఫస్ట్ షాట్ ఇది. దర్శకత్వం, ఎక్స్‌ప్రెషన్ క్రెడిట్ కూడా ఆయనదే" అంటూ క్యాప్షన్ రాశారు. దీంతో ఏం ప్లాన్ చేశావు.. సినిమా అయితే పిచ్చెక్కిపోతాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అంతే కదా భారత సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బెస్ట్ అఫ్ ది బెస్ట్ కలిస్తే ఆ మాత్రం ఎక్సయిట్మెంట్ ఉంటుంది. ఈ పోస్ట్ తో ఫ్యాన్స్‌కి ఎక్కినా కిక్కును ఆర్జీవీ నెక్స్ట్ ట్వీట్‌తోనే దించాడు. "ఒరేయ్ సుద్దపూసలరా నా ప్రీవియస్ పోస్ట్ జస్ట్ ఫహద్ నన్ను చూడటానికి నా డెన్‌కి వచ్చిన ఫోటో అంతే" అంటూ సినిమా చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 04:10 PM