Renu Desai: ఐమాక్స్‌లో సందడి చేసిన రేణూ దేశాయి!

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:52 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్  (Nag ashwin) దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 AD) సినిమాని ఈరోజు హైదరాబాద్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ఉన్న పీసీఎక్స్‌ స్క్రీన్లో రేణు దేశాయ్‌ (Renu desai) తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఇదే

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag ashwin) దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 AD) సినిమాని ఈరోజు హైదరాబాద్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో ఉన్న పీసీఎక్స్‌ స్క్రీన్లో రేణు దేశాయ్‌ (Renu desai) తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఇదే సినిమాకు తన కుమారుడు అకీరా నందన (Akhira Nandan) కూడా రావడం విశేషం. ఆఖీరా కల్కి  టీ షర్ట్‌ ధరించి సందడి చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్‌ ఇన్  స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. 'కల్కి’ అభిమానులం మేము అంటూ పేర్కొన్న ఆమె చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ చాలా బాగా అరిచి గోల చేశామని రాసుకొచ్చారు. ఈ దెబ్బతో కనీసం ఒక వారం రోజులైనా తన గొంతు పోయినట్టేనని ఆమె పేర్కొంది. ఈ రోజు ఉదయమే మార్నింగ్‌ షో చూడడం కోసం వెళ్ళామని ఖచ్చితంగా మీరందరూ మీ కుటుంబాలతో వెళ్లి ఆ సినిమా చూడాలని ఆమె పేర్కొన్నారు. తామంతా కల్కి అభిమానులమని రేణు దేశాయి చెప్పడం గమనార్హం.



ప్రభాస్‌, దీపికా పదుకోన జంటగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన, కమల్‌ హాసన, దిశా పటానీ, రాజేంద్ర ప్రదేశ తదితరులు కీలక పాత్రఽలు పోషించారు. అశ్వినిదత్‌ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

Updated Date - Jun 27 , 2024 | 05:10 PM