Renu Desai: రేణు దేశాయి.. ప్రత్యేక పూజలు.. ఎందుకంటే..

ABN, Publish Date - Oct 19 , 2024 | 08:39 PM

రేణు దేశాయి (Renu Desai) సంప్రదాయాలకు, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆమెకు భక్తి కూడా ఎక్కువే! భగవంతుడికి నివేదించే ప్రసాదాన్ని సైతం స్వయంగా తయారు చేసుకుంటారు.

రేణు దేశాయి (Renu Desai) సంప్రదాయాలకు, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆమెకు భక్తి కూడా ఎక్కువే! భగవంతుడికి నివేదించే ప్రసాదాన్ని సైతం స్వయంగా తయారు చేసుకుంటారు. అందులోనే ఆనందం ఉందని చెబుతుంటారు. ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో భక్తి శ్రద్థలతో లక్ష్మీ గణపతి హోమం తో పాటు, చండీ హోమం (Chandi Homam) నిర్వహించారు. శరద్‌ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో తనయుడు అకీరా నందన్‌ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘‘శరద్‌ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం నిర్వహించాం. మన సంస్కృతిలో శరద్‌ పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులుగా మన ఆచారాల ప్రాముఖ్యతను, పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొన్నారు. పూజలు చేేస సమయంలో ఆర్భాటాలకు పోవద్దని.. ప్రశాంతతో భగవంతుడు, భక్తి పైనే దృష్టి పైనే దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. చిరంజీవి ఇంటి పురోహితులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Oct 19 , 2024 | 08:39 PM