Renu Desai: అకీరా నా మాట విని పాటిస్తున్నాడు
ABN, Publish Date - Feb 24 , 2024 | 06:42 PM
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా కనిపిస్తారు రేణు దేశాయ్ (Renu desai). తన పిల్లలిద్దరి గురించి, తన వ్యక్తిగత అభిప్రాయాల గురించి సోషల్ మీడియా వేదికగా తెలుపుతుంటారు.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా కనిపిస్తారు రేణు దేశాయ్ (Renu desai). తన పిల్లలిద్దరి గురించి, తన వ్యక్తిగత అభిప్రాయాల గురించి సోషల్ మీడియా వేదికగా తెలుపుతుంటారు. ఇటీవల అకీరాకు(Akhira) ఓ సలహా ఇచ్చానని, నెమ్మదిగా దాన్ని పాటిస్తున్నాడని చెప్పారు.
"అకీరా ఎక్కువ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఉపయోగిస్తుంటాడు. వాటిని తగ్గించి వైర్ కలిగిన ఇయర్‌ఫోన్స్ వాడమని అకీరా, ఆద్యలకు చాలా కాలంగా చెబుతూ వస్తున్నా. ఎందుకంటే బ్లూటూత్ టెక్నాలజీ చెవులు, బ్రెయిన్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. అప్పటినుంచి అకీరా తన అలవాటును మార్చుకుని ఫ్యాన్సీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను పక్కనపెట్టి, వైర్‌తో ఉన్న ఇయర్‌ఫోన్స్ వాడుతున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గతేడాది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో రేణు దేశాయ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.