కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Game On: విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌.. రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్ జాన‌ర్‌ సినిమా

ABN, Publish Date - Jan 04 , 2024 | 07:42 PM

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

game on

గీతానంద్ (GeetAnand), నేహా సోలంకి (Neha Solanki) జంట‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’(Game On). క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ (Dayanandh) ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి(Ravi kasturi) మాట్లాడుతూ.. గేమ్ ఆన్ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

ర‌థం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ (GeetAnand) ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. అలాగే నేహ సోలంకి (Neha Solanki) త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు ద‌యానంద్ క‌థ‌ చెప్పిన దానిక‌న్నా కూడా చిత్రాన్ని అద్భ‌తంగా తెర‌కెక్కించాడన్నారు. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చిందని, ఈ చిత్రం కోసం మంచి స్టార్ క్యాస్ట్‌ను తీసుకున్నాం అన్నారు.


మధుబాల (Madhoobala) గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారన్నారు. న్యూ ఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటించాడు. ప్ర‌స్తుతం విభిన్నమైన క‌థ‌ల‌తో వ‌చ్చే చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో వ‌స్తోన్న మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌న్న న‌మ్మకంతో ఉన్నాం` అన్నారు.

దర్శకుడు దయానంద్ (Dayanandh) మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోవ‌డానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ (Game On) సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు న్యూ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌న్నారు.

Updated Date - Jan 04 , 2024 | 07:42 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!