మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravi Teja: కొత్త వ్యాపారంలోకి రవితేజ.. ఆ హీరోల బాటలోనే!

ABN, Publish Date - Feb 23 , 2024 | 10:58 AM

టాలీవుడ్‌ హీరోలు చాలామంది తమ వృత్తితో బిజీగా ఉంటూనే పలు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్నారు. స్టార్‌ హీరోలు అంతా థియేటర్స్‌ బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోలు చాలామంది తమ వృత్తితో బిజీగా ఉంటూనే పలు వ్యాపార రంగాల్లోనూ రాణిస్తున్నారు. స్టార్‌ హీరోలు అంతా థియేటర్స్‌ (multiflex) బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌ బాబు(Mahesh babu), అల్లు అర్జున్‌ (Allu arjun), విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) అత్యాధునికి టెక్నాలజీతో సుందరమైన థియేటర్స్‌ను నెలకొల్పారు. ఇప్పుడు అదే బాటలో మాస్‌ మహారాజా రవితేజ కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు  ఎఏంబీ పేరుతో ఏషియన్‌ సినిమాస్‌(Asian cinemas) భాగస్వామ్యంతో  గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్‌ నిర్మించారు. బెంగుళూరులో కూడా మరో థియేటర్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.



ఏడాది క్రితం అల్లు అర్జున్  అమీర్‌పేట్‌లో 'AAA' సినిమాస్  పేరుతో మల్టీఫ్లెక్స్‌ను నిర్మించారు. విజయ్‌ దేవరకొండ మహబూబ్‌నగర్‌లో  'AVD' పేరుతో మూడు స్క్రీన్స్ ఉన్న థియేటర్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ స్టార్‌ హీరోలందరూ ఏషియన సినిమాస్‌తో పార్టనర్‌షిప్‌ పెట్టుకుని ఈ రంగంలో దిగారు. ఇప్పుడు రవితేజ కూడా ఏషియన్‌ సినిమాస్‌ వారితో కలిసి ఒక మల్టీఫ్లెక్స్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు స్క్రీన్స్  వుంటాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌కు ఏషియన్‌ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా 'ART' సినిమాస్‌ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. 

Updated Date - Feb 23 , 2024 | 10:58 AM