Ravi Teja: త్వరగా సెట్స్‌లో అడుగుపెట్టేందుకు!
ABN, Publish Date - Aug 24 , 2024 | 03:49 PM
మాస్ మహారాజ రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘
మాస్ మహారాజ రవితేజ (Ravi teja) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ చిన్న సర్జరీ తర్వాత క్షేమంగా (Ravi Teja Discharged) డిశ్చార్జ్ అయ్యా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా. నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు పంపిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ.. ‘గెట్ వెల్ సూన్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఆయన భాను భోగవరపు దర్శకత్వంలో 'RT 75' (RT 75)చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శ్రీలీల ఇందులో కథానాయిక. సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫోర్చూన ఫోర్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఆ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది. దీంతో సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కుడి చేతికి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.