మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijay Devarakonda: విజయ్‌తో దిల్‌ రాజు మరో సినిమా.. ఇదే అప్‌డేట్‌!

ABN, Publish Date - May 04 , 2024 | 12:15 PM

ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో పరాజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మరో సినిమాతో కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌ రాజు (Dil raju) నిర్మాణంలో విజయ్‌ మరో సినిమా చేయబోతున్నారు.

ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో పరాజయం అందుకున్న విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మరో సినిమాతో కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌ రాజు (Dil raju) నిర్మాణంలో విజయ్‌ మరో సినిమా చేయబోతున్నారు. 'రాజావారు రాణిగారు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన మార్క్‌ చూపించిన రవికిరణ్‌ కోలా (Ravikiran Kola) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీ సంస్థ నిర్మిస్తున్న 59వ చిత్రమిది. దిల్‌ రాజు - శిరీష్‌ నిర్మాతలు. 

శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను వేంకటేశ్వర క్రియేషన్స్  సంస్థ ప్రకటించింది. లార్జర్‌ దేన్  లైఫ్‌ అన్నట్లు రూరల్‌ యాక్షన్  డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో పరశురామ్‌ దర్శకుడిగా విజయ్‌ నటించిన 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రం పరాజయం పాలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అయినా దిల్‌ రాజు విజయ్‌తో మరో సినిమా చేయడం విశేషం. ఆయన మాటిచ్చినట్టుగానే విజయ్‌తో రెండో సినిమా చేస్తున్నారు.  మే 9న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడిస్తారు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని సమాచారం.

Dasari Narayana Rao : దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ

Read More: Tollywood, Cinema news

Updated Date - May 04 , 2024 | 12:16 PM