Rashmika Mandanna: పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి రియాక్షన్ ఇదే..
ABN, Publish Date - Dec 13 , 2024 | 06:45 PM
నేడు జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ తతంగంపై నటి రష్మిక మందన్న ఎమోషనల్ అయ్యారు.
సినీ నటుడు అల్లు అర్జున్‌కు (Allu Arjun) హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు రూ. 50,000ల సొంత పూచికత్తుపై అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలోనే నిన్న, మొన్నటి వరకు బన్నీతో 'పుష్ప 2' సక్సెస్ ని ఎంజాయ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న నేడు జరిగిన తతంగాన్ని చూసి చలించిపోయారు. తన సోషల్ మీడియా ఖాతా నుండి పోస్టు చేస్తూ.."నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను.. జరిగిన సంఘటన దురదృష్టకరం, చాలా బాధాకరమైన సంఘటన. అయితే, అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం బాధకలిగించింది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది" అంటూ ఎమోషనల్ అయ్యారు.