Allu Arjun: పుష్పరాజ్‌కు శ్రీవల్లి గిఫ్ట్‌..  వెండి వస్తువు  ఇస్తే.. 

ABN, Publish Date - Nov 10 , 2024 | 10:38 AM

అల్లు అర్జున్ కి హీరోయిన్ రష్మిక సర్ ప్రైస్ ఇచ్చింది. అమ్మ చెప్పిందని ఒక గిఫ్టును బన్నీకి పంపింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...

‘పుష్ప ది రూల్‌’ (Pushpa: The Rule) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్థమయ్యారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu arjun). రష్మిక మందన్నా కథానాయికగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో రష్మిక తనకు ప్రత్యేక కానుక పంపించినట్లు (Rashmika Gift to Bunny) అల్లు అర్జున్‌ తెలిపారు. ‘‘వెండి వస్తువు కానుకగా అందుకుంటే ఆ వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పారు. ఈ వెండి వస్తువు, స్వీట్స్‌ తప్పకుండా మీకు మరెంతో లక్‌, పాజిటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్నా’’ అనే సందేశాన్ని ఆమె పంపించారు. ఈ నోట్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘‘థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి’’ అని అల్లున్‌  రాసుకొచ్చారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘‘బాక్సాఫీస్‌ వద్ద ‘పుష్ప’ (Pushpa 2) తప్పకుండా రూల్‌ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆడియన్స్‌ మన శ్రమను గుర్తిస్తారు. నేను ఎంతో నమ్మకంతో ఉన్నా’’ అని పేర్కొన్నారు.



ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రం 2021లో విడుదలైంది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ ఊరమాస్‌ యాక్షన్‌, శ్రీవల్లిగా రష్మిక నటన సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కూలీ స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి పుష్ప ఏవిధంగా ఎదిగాడనే విషయాలను మొదటి భాగంలో చూపించారు. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్థమవుతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శ్రీలీల బన్నీలపై ప్రత్యేక గీతం చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. 

READ MORE: RIP Delhi Ganesh: కోలీవుడ్‌లో విషాదం.. ఢిల్లీ గణేశ్‌ ఇక లేరు


Updated Date - Nov 10 , 2024 | 11:11 AM