మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yevam: ఏది మంచి.. ఏది కాదు! యేవ‌మ్ నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల

ABN, Publish Date - May 30 , 2024 | 09:43 AM

చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతున్న చిత్రం యేవమ్‌. తాజాగా ఈ చిత్రం నుంచి ఏది మంచి.. ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్‌భాస్క‌ర్ విడుదల చేశారు.

yevam

చాందిని చైద‌రి (Chandini Chowdary), వ‌శిష్ట సింహా (Vasishta N Simha), భరత్‌రాజ్ (Jai Bharat Raj), ఆషు రెడ్డి (Ashu Reddy) ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్‌ (Yevam). నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి.. ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్‌భాస్క‌ర్ విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్రకాష్‌ దంతులూరి (Prakash Dantuluri) మాట్లాడుతూ.. రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో ఉన్నాం అన్నారు.


మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్ ఫుల్‌గా, కొత్త‌గా, ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ ఉంటుందన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 09:43 AM