మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramojirao final journey: ప్రశాంత స్మారక వనంలో అంత్యక్రియలు.. పాడె మోసిన బాబు!

ABN, Publish Date - Jun 09 , 2024 | 11:04 AM

మీడియా మొగల్‌ రామోజీరావు తన స్మారక కట్టడాన్ని మరణానికే ముందే సిద్థం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన పాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

మీడియా మొగల్‌ రామోజీరావు (Ramojirao) తన స్మారక కట్టడాన్ని (Smrtuthivanam)మరణానికే ముందే సిద్థం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని (Ramoji filmcity)విశాలమైన పాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రే ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్‌లో పరామర్శించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి శనివారం పరిశీలించారు.

పలువురు ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న నేపథ్యంలో  పకడ్బందీ  భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాడెను  మోశారు. మరికొద్ది సేపట్లో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. 

Read more!
Updated Date - Jun 09 , 2024 | 11:15 AM