Double iSmart Twitter/ X Review: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఎలా ఉందంటే? ట్విట్టర్ రివ్యూ
ABN, Publish Date - Aug 15 , 2024 | 09:07 AM
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో ఐదేండ్ల తర్వాత వస్తున్న మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ రోజు (గురువారం ఆగష్టు 15)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నెటిజన్లు ఏవిధంగా స్పందిస్తున్నారంటే.
ఉస్తాద్ రామ్ పోతినేని (RAm POthineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో ఐదేండ్ల తర్వాత వస్తున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’(Double iSmart). రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ ప్రతి నాయకుడిగా కనటించగా కావ్య థాపర్ (Kavya Thapar) కథానాయికగా చేసింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు (గురువారం ఆగష్టు 15)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఈ సినిమా చూసిన వాళ్లు తమ ఫీలింగ్‌ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియ జేస్తున్నారు. మరి వారి అభప్రాయాలు ఉలా ఉన్నాయంటే. సినిమా విడుదలైన ప్రతి చోట నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. మూవీలో పూరి మార్క్ కామెడీ, అలీ గెటప్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్, మణిశర్మ బ్యా గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని చెబుతున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసేలా ఉన్నాయంటున్నారు. కావ్య థాపర్ తన అందాలతో మైమరిపించిందని, సంజయ్ దత్ విలనీ బావున్నాయన్నారు.
ప్రతి ప్రేమ్‌లో రామ్ తన పేరుకు తగ్గట్లు ఫుల్ ఎనర్జీతో వీర లెవల్‌లో ఆకట్టుకున్నట్లు పోస్టులు పెట్టారు. అదేవిధంగా పూరి మార్క్ డైలాగులు, రామ్ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని అనడం విశేషం. ఈ సారి రామ్ 100 కోట్ల క్లబ్‌లో చేరతాడని, పూరికి,రామ్‌కు మంచి కంబ్యాక్ వచ్చేసినట్టేనంటున్నారు. మరికొందరు సినిమా కాస్త లాగ్ అనిపిస్తుందని, అక్కడక్కడ లాజిక్స్ మిస్సయ్యాయని, కాస్త ఔట్ డేట్ రావేంజ్ కాన్సెప్ట్ అని పేర్కొంటున్నారు.