Ram Gopam Varma: విచారణకు గైర్హాజరు.. సమయం కావాలన్న వర్మ

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:01 PM

వివాదాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు రామ్‌గోపాల్‌ (Ram Gopal Varma) వర్మ ఏపీ పోలీసులు (Ap Police) విచారణకు గైర్హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు మెసేజ్‌ పంపారు.


వివాదాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు రామ్‌గోపాల్‌ (Ram Gopal Varma) వర్మ ఏపీ పోలీసులు (Ap Police) విచారణకు గైర్హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు మెసేజ్‌ పంపారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.  మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ (Investigation) హాజరు కావాల్సి ఉండగా.. సమయం కావాలంటూ ఆయన సమాచారం పంపారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ (vyuham) సినిమా ప్రమోషన్‌ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో రామ్‌గోపాల్‌ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు  స్పష్టం చేసింది.

Updated Date - Nov 19 , 2024 | 01:01 PM