Ram Gopal Varma: డేరింగ్ వర్మకి భయం.. థర్డ్ డిగ్రీ భయం
ABN, Publish Date - Nov 20 , 2024 | 10:03 AM
తాజాగా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఆయన పేర్కొన్న విషయాలు చూస్తే ఆయనలో భయం పుట్టినట్లు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ పిటిషనన్‌లో ఏముందంటే..
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి పోలీస్ భయం పట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయనపై నమోదు అయినా కేసుపై విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఆయన పేర్కొన్న విషయాలు చూస్తే ఆయనలో భయం పుట్టినట్లు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆ పిటిషనన్‌లో ఏముందంటే..
ఎవరైనా ఏమైనా చేస్కోండి 'ఐ డోంట్ కేర్' అంటూ చెలరేగిపోయే ఆర్జీవీ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఏపీ పోలీసులు విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ హైకోర్టు లో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో డేరింగ్ ఆర్జీవీలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. మంగళవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ఆయన తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు మెసేజ్ పంపారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉండగా.. సమయం కావాలంటూ ఆయన సమాచారం పంపారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రామ్‌గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది.