40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Honeymoon Express: హనీమూన్ ఎక్స్‌ప్రెస్.. 'నిజమా' పాట విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

ABN, Publish Date - Jan 23 , 2024 | 05:20 PM

చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్. ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి 'నిజమా అంటూ సాగే పాటను ఈ రోజు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

Honeymoon Express

ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express). తనికెళ్ల భరణి (Tanikella Bharni) మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నఈ చిత్రానికి బాల రాజశేఖరుని ( BALA_RAJASEKHARUNI) రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ (Kalyani Malik) సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాలరాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.

అయితే ఈ రోజు కళ్యాణి మాలిక్ (Kalyani Malik) స్వరపరిచి, సింగర్ సునీత తో కలిసి పాడిన అందమైన ప్రేమ గీతం 'నిజమా' పాటను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ "నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express) చిత్రం నుంచి 'నిజమా' పాటను ఇప్పుడే చూశాను, పాట చాలా మెలోడియస్ గా ఉంది, చాలా బాగా చిత్రీకరించారు. కెమెరామేన్ పనితీరు మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం, మంచి విజయం సాధించాలి" అన్నారు.


దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారితో రెండు హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను, బ్యూటీ ఆఫ్ ప్యాషన్ మరియు ఆట అనే రెండు చిత్రాలకు పని చేశాను, రెండు చిత్రాలు డెవలప్మెంట్ లో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గారు మరియు ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express) చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నానన్నారు.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రమ‌ని, చైతన్య రావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel), తనికెళ్ళ భరణి మరియు సుహాసిని (Suhasini) ముఖ్య పాత్రలు పోషిస్తున్నార‌న్నారు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గారు ఈరోజు మా చిత్రంలోని మొదటి పాట నిజమా లిరికల్ వీడియో ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.

Updated Date - Jan 23 , 2024 | 05:24 PM