Ram Charan: రామ్ చరణ్ పరమత సహనం.. అందరికి ఆదర్శం

ABN, Publish Date - Nov 18 , 2024 | 08:54 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పరమత సహనం చాటుకున్నారు. ఒకవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే ఎఆర్‌ రెహమాన్‌‌కి ఇచ్చిన మాట కోసం ఆయన ఏం చేశారంటే..

గ్లోబల్ రామ్ చరణ్ ఏం చేసిన 'ఆన్‌ప్రిడిక్టబులే'. ఒక వైపు యాక్టర్‌గా ఆయన సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్స్, ప్రొడ్యూసర్‌గా నిర్మించే సినిమాలు ఒకటేంటి అన్నింట్లో రామ్ చరణ్ ఆన్‌ప్రిడిక్టబుల్. ప్రస్తుతం ఆయన నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఒకవైపు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన ఆధ్యాత్మికంగా కూడా తన జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అయ్యప మాలాధారణతో నిష్టగా ఉన్న ఆయన పరమత సహనాన్ని చాటి చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఎం చేశారంటే..


ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం 'కడప దర్గా'లో 'నేషనల్ ముషాయిరా గజల్' కార్యక్రమంతో పాటు వైభవంగా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఈ ఉత్సాహాలకి హాజరయ్యారు. దీంతో అభిమానులు కడప విమానాశ్రయం నుండి పెద్ద దర్గా వారికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్గా సాంప్రదాయాల ప్రకారం పీఠాధిపతి ఆరీఫ్ హుస్సేన్, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ.. 'యూ ఆర్ ఆన్‌ప్రిడిక్టబుల్ బాస్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


అయితే గత ఏడాది ఇదే ఈవెంట్‌కు సంగీత దర్శకుడు ఎ.ఆర్‌ రెహమాన్‌ హాజరయ్యారు. ఆయన సూచనతో నిర్వాహకులు రామ్‌చరణ్‌ను అతిథిగా ఆహ్వానించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ రెహమాన్‌ సూచించడంతో చరణ్‌ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. అంతకు ముందు చరణ్ కడపలోని శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Updated Date - Nov 18 , 2024 | 08:54 PM