Game Changer: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:13 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram charan), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’ . కాంబినేషన్‌ రీత్యా ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.


గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram charan), సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’ (Game Changer). కాంబినేషన్‌ రీత్యా ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దిల్‌ రాజు (Dil raju), శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్‌, ‘జరగండి జరగండి..’,  ‘రా మచ్చా మచ్చా’ సాంగ్స్‌కు చక్కని ఆదరణ లభించింది. యూట్యూబ్‌ లో ‘రా మచ్చా మచ్చా’ 55+ మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

అందులో రామ్‌ చరణ్‌ స్టైలిష్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. శంకర్‌ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాలను తెరకెక్కించటమే కాకుండా, అభిమానులకు ప్రేక్షకులకు డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్‌ చరణ్‌లాంటి మాస్‌ హీరో ఉన్నప్పుడు ఆ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంటుందో చూడాలని మెగా అభిమానులు, మూవీ లవర్స్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ను రూపొందిస్తున్నారని, చరణ్‌ను ఫవర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారని మేకర్స్‌ చెబుతున్నారు. కియారా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - Oct 12 , 2024 | 07:13 PM