Anchor Suma: యాంక‌ర్ సుమ మాటలు నమ్మి మోసపోయాం.. సుమ వివ‌ర‌ణ

ABN, Publish Date - Aug 07 , 2024 | 05:24 PM

టాలీవుడ్ సెల‌బ్రిటీ యాంకర్ సుమ కొత్త చిక్కుల్లో ఇరుకున్నారు. సుమ లాంటి సెలబ్రిటీ మాటలు నమ్మి ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో లక్షలు కట్టి మోస‌పోయామ‌ని ఇప్పుడు సుమనే మాకు న్యాయం చెయ్యాల‌ని కోరుతున్నారు.

suma

రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని, టాలీవుడ్ సెల‌బ్రిటీ యాంకర్ సుమ (Suma) కొత్త చిక్కుల్లో ఇరుకున్నారు. గ‌తంలో అమె చేసిన ఓ రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌మోష‌న్ ఇప్పుడు ఆమెకు కొత్త ఇబ్బందుల‌ను తెచ్చి పెట్టాయి. సుమ లాంటి సెలబ్రిటీ మాటలు నమ్మి మోసపోయామని. ఆమె ప్ర‌మోట్ చేస్తూ అంబాసిడ‌ర్‌గా ఉన్న ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో లక్షలు లక్షలు కట్టి మోస‌పోయామ‌ని ఇప్పుడు సుమనే మాకు న్యాయం చెయ్యాలంటూ తాజాగా చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో చంద్రిక అవంతిక ఫేస్ 2 అనే వెంచర్ వేసింది. ఈ సంద‌ర్భంగా డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లను కట్టి తక్కువ రేట్‌కే ఇస్తామని ప్రచారం చేసింది. దీనికి యాంక‌ర్ సుమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ నమ్మకంతో కూడిన కంపెనీ అంటూ చెప్పింది. దీంతో చాలా మంది సొంత ఇంటి కోసం ఒక్కొక్కరు రూ. లక్షల‌ నుంచి కోట్ల వ‌ర‌కు డబ్బులు కట్టారు.

అయితే గ‌డువు ముగిసిన కూడా అప్ప‌జెప్ప‌క‌పోవ‌డంతో వారికి అనుమానం రాగా ఏకంగా 88 కోట్లు కట్టించుకొని బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన‌ట్లు తెలిసింది. అయితే.. ఇప్పటి వరకు ఆ ప్ర‌దేశంలో ఎలాంటి ఫ్లాట్స్ కట్టలేదని, వారు ఎక్కడకి వెళ్లారో కూడా తెలియట్లేదంటూ బాధితులు వాపోతున్నారు. వాళ్లు చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ప్లకార్డులతో రోడ్లపై నిరసన చేపట్టారు ఈ క్ర‌మంలో కొంత మంది బాధితులు యాంక‌ర్‌ సుమ ఈ విషయంలో కల్పించుకోవాలని మాకు న్యాయం చేయాల‌ని.. ఆమెను చూసే మేము డబ్బులు కట్టామని చెప్తున్నారు. ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఈ విష‌యంలో కల్పించుకొని న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.


ఈ సంద‌ర్భంగా కొంద‌రు బాధితులు మీడియాతో మాట్లాడూతూ ‘రాకీ అవెన్యూస్ ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 త్వరలో కట్ట‌బోతున్నామని సుమతో ప్రచారం చేయించడం వల్లే న‌మ్మి అక్క‌డ‌ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన‌ట్టు తెలిపారు. మ‌రో బాధితుడు మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం వల్లనే వాటికి ఆకర్షితులమయ్యామ‌నిపెద్ద కంపెనీ కావడంతో పాటు తక్కువ ధరకు ఇస్తానని చెప్ప‌డంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశామ‌న్నారు. అయితే సుమను తప్పు పట్టడం లేదని.. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం అని బాధితులు చెబుతున్నారు.

ఇదిలాఉండ‌గా.. ఇ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌డంతో యాంక‌ర్ సుమ స్పందిస్తూ.. ఓ అధికారిక నోట్ విడుదల చేసింది. గ‌తంలో నేను రాకీ అవెన్యూస్ కోసం చేసిన ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌స్తుతం సామాజిక మాద్య‌మాల్లో క‌నిపించ‌డం నా దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అయితే నేను రాకీ అవెన్యూస్‌తో 2016 నుంచి 2018 వ‌ర‌కు మాత్ర‌మే ఒప్పందం చేసుకున్నాన‌ని ప్ర‌స్త‌తం ఆ సంస్థ‌తో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. ఇదే విష‌యమై ఇప్ప‌టికే అక్క‌డ ఫ్లాట్స్ కొన్న కొంత‌మంది నాకు లీగ‌ల్ నోటీసులు కూడా ఇచ్చార‌ని వాటికి నేను స‌మాధానం ఇవ్వ‌డంతో పాటు స‌ద‌రు రాకీ సంస్థ‌కు నోటీసు పంపించి ఏదైనా ప్ర‌క‌ట‌న చేయాల‌ని కోరిన‌ట్లు తెలిపింది.

Updated Date - Aug 07 , 2024 | 05:54 PM