Thandel Raju: తండేల్ రాజు.. నాగ చైతన్య లుక్ అదిరింది
ABN, Publish Date - May 23 , 2024 | 09:03 AM
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్. తాజాగా హీరో నాగ చైతన్య సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అవుతోంది.
నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా చందూ మొండేటి (chandoo mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్(Thandel). గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind)సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు (Bunny Vas) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా హీరో నాగ చైతన్య (Naga Chaitanya) సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య (Naga Chaitanya). ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.
తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య (Naga Chaitanya) ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DEVI SRI PRASAD) సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.