Raj Tarun: లావణ్యా వివాదం సైలెంట్.. రాజ్‌ తరుణ్‌ ఏమన్నారంటే

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:27 PM

లావణ్య (lavanya) వల్ల ఇటీవల తాను ఎదుర్కొన్న వివాదాల్లోకి మళ్లీ లాగొద్దని రాజ్‌ తరుణ్‌ (Raj tarun) కోరారు. ఆయన నటించిన తాజా సినిమా ‘భలే ఉన్నాడే’ (Bhale unnade).

లావణ్య (lavanya) వల్ల ఇటీవల తాను ఎదుర్కొన్న వివాదాల్లోకి మళ్లీ లాగొద్దని రాజ్‌ తరుణ్‌ (Raj tarun) కోరారు. ఆయన నటించిన తాజా సినిమా ‘భలే ఉన్నాడే’ (Bhale unnade). మనీషా (maneesha) కథానాయిక. జె.శివసాయి వర్థన్‌ తెరకెక్కించారు. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించింది. ‘‘శివసాయి వర్థన్‌ను చూశాక ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సినిమా బాగా రావడం కోసం నిర్మాత?ని ఎక్కడా రాజీ పడలేదు. మొదటి సినిమా అయినా మనీషా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా  దీన్ని రూపొందించాం. మా దర్శకుడు పవన్‌ కల్యాణ్‌ అభిమాని కావడంతో ట్రైలర్‌లో గబ్బర్‌సింగ్‌ పేరు వాడారు’’ అని అన్నారు. "రెండు నెలలో వరుసగా ఇది మూడో సినిమా. ప్లాన్‌ చేసింది కాదు. అలా కలిసొచ్చింది. సవాల్‌ విసిరే పాత్రలంటే నాకు ఇష్టం. రొటీన్‌గా చేస్తుంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. ఇందులో పాత్ర కొత్తగా ఉంటుంది. రెండు నెలలుగా ఓ వివాదంతో సతమతమవుతున్నా. ఇప్పుడే బయటకు వచ్చా. మళ్లీ నన్ను ఆ గొడవలోకి లాగొద్దు. కారణాలు ఏమైనా నా గత చిత్రాలను సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయా. ఆ విషయంలో పశ్చాత్తాపపడుతున్నా. ఉన్నట్టుండి లావణ్య ఇష్యూ కామ్‌ అయిపోయింది ఏం చేశారన్న ప్రశ్నకు ''నేనేం చేయలేదండి. దేనికైనా ఒక టైమ్‌ ఉంటుంది కదా! లావణ్య ఇష్యూతో సినిమాలు ప్రమోట్‌ చేసుకుంటున్నానని కూడా అన్నారు. అలా ఎవరైనా ప్రచారం చేసుకుంటారా? చెప్పండి అని అన్నారు. 



రాజ్‌తరుణ్‌ త్వరలో బిగ్‌బాస్‌కు వెళ్తున్నారన్న టాక్‌ నడుస్తోంది’ అన్న ప్రశ్నకు దర్శకుడు శివసాయి సమాధానమిచ్చారు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. అన్ని రోజులు ఒకే హౌస్‌లో ఉండడం జరిగే పని కాదు. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రతి సన్నివేశాన్ని ఫ్యామిలీతో చూసేలా  తెరకెక్కించా. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఒక్కటి కూడా వాడలేదు. మారుతి గారి సలహాలు తీసుకున్నాం. మనం ఏ పాత్ర చెప్పినా ఆయన వెంటనే డ్రాయింగ్‌ వేస్తారు. అది ఆయన గొప్పతనం. రాజ్‌తరుణ్‌కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకోలేదు. నేను రాసిన పాత్రను దృష్టిలో పెట్టుకున్నా. ఆయన నటన చూసి ఆశ్చర్యపోయాను" అని దర్శకుడు శివ సాయి అన్నారు. 

Hero Nani: 'ఈగ - 2’ ఎప్పుడంటే  నీతో అవసరం లేదన్నారు!


Updated Date - Aug 27 , 2024 | 05:21 PM