Rahul Ravindran: వావ్.. అనిపిస్తున్నా రాహుల్ రవీంద్రన్ సెలెక్షన్!

ABN, Publish Date - Oct 08 , 2024 | 06:15 PM

రాహుల్ రవీంద్రన్ నటుడిగానే కాదు డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ మ్యాన్ దర్శకుడిగా రెండు సినిమాలను పట్టాలపైకెక్కించాడు. అలాగే అందులో అద్భుతమైన నటులను క్యాస్ట్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా, నటీనటులు ఎవరంటే..

rahul ravindran

అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా పరిచయమై తక్కువ కాలంలోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో రాహుల్ రవీంద్రన్. కేవలం తెలుగు సినిమాలే కాకుండ తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తున్నాడు. తాజాగా అలియా భట్ జిగ్రా సినిమాలో కీలక రోల్ లోనే చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ మ్యాన్ దర్శకుడిగా రెండు సినిమాలను పట్టాలపైకెక్కించాడు. అలాగే అందులో అద్భుతమైన నటులను క్యాస్ట్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా, నటీనటులు ఎవరంటే..


'చి ల సౌ' సినిమా ద్వారా దర్శకుడిగా అవతారమెత్తిన ఆయన తొలి సినిమాతోనే అందరిని ఆశ్చర్యపరిచాడు. సున్నితమైన నేరేటివ్ ఆయన తొలి సినిమాకే జాతీయ అవార్డు సాధించాడు. తర్వాత నాగార్జున తో తీసినా మన్మధుడితో డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సంధర్భంగా ఆయన కాస్త గ్యాప్ తీసుకొని దర్శకుడిగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఫస్ట్ ఫిల్మ్‌లో పాన్ ఇండియా చిత్రాలతో హవా కొనసాగిస్తున్న రష్మిక మందన్న ప్రధాన పాత్రలో 'ది గర్ల్ ఫ్రెండ్' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. రష్మిక ఒకవైపు భారీ ప్రాజెక్టులు చేస్తూనే.. చిన్న సినిమాలు చేస్తుండటం విశేషం. ఇక రాహుల్ నెక్స్ట్ సుధీర్ బాబుతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ప్రమోషన్స్ లో సుధీర్ బాబు ఈ విషయాన్ని తెలియజేసాడు. దీంతో డైరెక్టర్‌గా రాహుల్ సెలెక్షన్ ఎప్పటిలాగానే వావ్ అంటున్నారు ఫ్యాన్స్.

Also Read- Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ తనని ఎలా ప్రేమలో పడేశాడో.. అదితి చెప్పేసింది


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2024 | 06:15 PM