Kiran Abbavaram- Rahasya: ఆ పిలుపు కోసం ఇంకా 38 రోజులు వేచి చూడాలి!
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:06 PM
'ఎస్ఆర్ కళ్యాణ మండపం’ ఫేం కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు
'ఎస్ఆర్ కళ్యాణ మండపం’ ఫేం కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak) వివాహానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. తనకు కాబోయే భర్త కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని రహస్య ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనకు బర్త్డే విషెస్ చెబుతూ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ సమయం నుంచి నిశ్చితార్థమైన నాటివరకూ వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు, వీడియోలతో ఓ ప్రత్యేక వీడియో క్రియేట్ చేసి ఇన్ స్టాగ్రామ్లో వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం. మరో 38 రోజుల్లో నిన్ను.. మై హస్బెండ్ అనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు రహస్య. 38 రోజులు అంటే ఆగస్ట్ 21న వీరిద్దరి పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. (KA Movie)
‘రాజావారు రాణిగారు’తోనే కిరణ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో రహస్య కథానాయికగా నటించారు. ఈ చిత్రం షూటింగ్లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. కిరణ్ ప్రస్తుతం ‘క’ సినిమా చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. సుజీత్, సందీప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘క’ టీజర్ విడుదల చేశారు.