మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghu Babu: నటుడు రఘుబాబుకు బెయిల్‌

ABN, Publish Date - Apr 19 , 2024 | 07:44 PM

సీనియర్‌ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు (Raghubabu)నడుపుతున్న కారు ఓ ద్విచక్ర వాహన దారుడిని ఢీ కొట్టిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో ఆ బైక్‌ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

సీనియర్‌ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు (Raghubabu)నడుపుతున్న కారు ఓ ద్విచక్ర వాహన దారుడిని ఢీ కొట్టిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో ఆ బైక్‌ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం (nalgonda Car accident) జరిగింది. మృతుడు బీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లగొండ, శ్రీనగర్‌ కాలనీకి చెందిన సందినేని జనార్దన్‌ రావు (55). బీఆర్‌ఎస్‌ నలగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్‌ రావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. బుధవారం సాయంత్రం బైక్‌పై వెంచర్‌కు వెళుతూ నల్లగొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు, జనార్థన్‌ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో జనార్దన్‌ గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడి.. పక్కన డివైడర్‌పై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. జనార్దన్‌ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి రఘుబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 

Updated Date - Apr 19 , 2024 | 07:44 PM