Pushpa -3: పుష్ప 3 కూడా ఉంది.. ఇదిగో ఆధారం
ABN, Publish Date - Dec 03 , 2024 | 01:33 PM
పుష్ప 3 కూడా ఉంటుందనే విషయం చాన్నాళ్లుగా వైరల్ అవుతోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో బయటకు వచ్చింది.
"పుష్ప చిత్రాలు ఇంత అద్భుతంగా రావడానికి బన్నీ మీదున్న ప్రేమే కారణం. మరో మూడేళ్లు సమయం ఇస్తే పుష్ప -3 కూడా తీస్తాను" అని సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ అన్నారు. అయితే పుష్ప 3 కూడా ఉంటుందనే విషయం చాన్నాళ్లుగా వైరల్ అవుతోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకోట్టి పని చేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్ ఉంది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ (Pushpa3: The Rampage) అని ఉండటంతో పార్ట్-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప2: ది రూల్’ (Pushpa2 The Rule) ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పుష్ప3’కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కొన్నాళ్ల కింద ట్రెండ్ అయ్యాయి. ‘పార్ట్3’ ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు. అయితే, ‘పుష్ప2’ క్లైమాక్స్‌లో ‘పార్ట్-3’కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. ‘పుష్ప3’ కచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. రెండు, మూడేళ్ల తర్వాతే ‘పార్ట్3’కి అవకాశం ఉందని చెబుతున్నారు.
Updated Date - Dec 03 , 2024 | 02:18 PM