Pushpa Alert: దేవర దెబ్బతో పుష్ప అలర్ట్

ABN, Publish Date - Sep 23 , 2024 | 03:00 PM

'పుష్ప-2' ప్రీ రిలీజ్ని ఔట్ డోర్ ఈవెంట్‌గానే ప్లాన్ చేస్తామని చెప్పారు. అభిమానులని దృష్టిలో ఉంచుకొనే తగిన ఏర్పాట్లు పకడ్బందీగా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.

'దేవర'(Devara) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడంతో అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. అయితే ఈ సీన్ రిపీట్ అవ్వకుండా పుష్ప(Pushpa) యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకోనుందని ఆ సినిమా ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ తెలిపారు. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అందుకున్న మత్తు వదలరా-2 సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ ఘటన బాధని కలిగించిందని నేను కూడా ఈ ఈవెంట్‌కి హాజరు కావాల్సిందని తెలిపారు. పుష్ప ప్రీ రిలీజ్ ని ఔట్ డోర్ ఈవెంట్‌గానే ప్లాన్ చేస్తామని చెప్పారు. అభిమానులని దృష్టిలో ఉంచుకొనే తగిన ఏర్పాట్లు పకడ్బందీగా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే దేవర టికెట్ ప్రైజ్ హైక్ విషయంలో ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా పుష్ప టికెట్స్ విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పుష్ప పై వస్తున్నా అనవసర రూమర్స్‌కి మీడియా ఆజ్యం పోయకుండా సహకరించాలని కోరారు. మొదటి పార్ట్ పుష్పతో దేశ వ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సాధించిన ఈ సినిమా రెండవ పార్ట్ పుష్ప (Pushpa 2)డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడదల కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

Updated Date - Sep 23 , 2024 | 03:00 PM