Pushpa 2: పుష్ప అంటే ఎన్ని బ్రాండ్‌లో తెలుసో..
ABN, Publish Date - Nov 18 , 2024 | 02:43 PM
పుష్ప సినిమాలో చూపించిన విధానంగానే 'పుష్ప అంటే బ్రాండ్' అనే విషయాన్ని నిన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో మేకర్స్ క్రిస్టల్ క్లియర్‌గా ప్రూవ్ చేశారు. ఇంతకీ పుష్ప బ్రాండ్ స్టోరీ ఏంటంటే..
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతోగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఎవరు ఊహించని రీతిలో ట్రైలర్ అంచనాలకు మించి ఉండటంతో ఎక్కడ చూసిన పుష్ప గాడి బ్రాండ్ మార్క్ కనిపిస్తోంది. పుష్ప సినిమాలో చూపించిన విధానంగానే 'పుష్ప అంటే బ్రాండ్' అనే విషయాన్ని నిన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో మేకర్స్ క్రిస్టల్ క్లియర్ గా ప్రూవ్ చేశారు. ఇంతకీ పుష్ప బ్రాండ్ స్టోరీ ఏంటంటే..
'పుష్ప అంటే పేరు కాదు .. వైల్డ్ ఫైరు..' అని 'సుకుమార్' ఏ ముహర్తన రాశారో కానీ అది నిన్న పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో వాస్తవంగా కనపడింది. సగటు తెలుగు సినిమా స్టార్ హీరో అందుకొని ఫ్యాన్ క్రేజ్‌ని అల్లు అర్జున్ నార్త్ లో సాధించారు. ఈ క్రేజ్ ని చూసి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ ఏ కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా షేక్ అయ్యింది. అది రియల్ లైఫ్ లో పుష్ప క్రియేట్ చేసిన బ్రాండ్. ఇదంతా పక్కన పెడితే పుష్ప ప్రమోషన్స్ ని రూ. 150 కోట్లతో భారీగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీని వెనుకాల అక్షరాల 23 బ్రాండ్ లు ఉన్నాయి.
అవును, పాట్నాతో పాటు కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లలో మాసివ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. వీటితో పాటు మిగతా అన్ని ప్రమోషన్స్ కి కలిపి రూ . 150 కోట్లు కాచు పెట్టనున్నారు. అయితే ఈ ఖర్చును కేవలం మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే భరించడం లేదు. పుష్ప రాజ్ బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకొని 23 బ్రాండ్ లు ఈ ఖర్చుని భరిస్తూ మూవీని స్పాన్సర్ చేస్తున్నాయి. ఆ బ్రాండ్స్ వివరాలను సినిమా ట్రైలర్ లో చూడొచ్చు.