Pushpa 2: మరో నేషనల్‌ అవార్డుకు అల్లు అర్జున్‌ అర్హుడు

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:30 PM

"అల్లు అర్జున్‌ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఏ పార్టీలోనూ లేరు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ డివైడ్‌ అయ్యారనే మాట కరెక్ట్‌ కాదు. రెండు కుటుంబాలు ఒక్కటే. మెగా ఫ్యాన్స్‌ అంతా ఒకటే. అందరు పుష్ప -2 కోసం ఎదురు చూస్తున్నారు

"అల్లు అర్జున్‌ (Allu Arjun) ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఏ పార్టీలోనూ లేరు. మెగా ఫ్యామిలీ(Mega Family), అల్లు ఫ్యామిలీ డివైడ్‌ అయ్యారనే మాట కరెక్ట్‌ కాదు. రెండు కుటుంబాలు ఒక్కటే. మెగా ఫ్యాన్స్‌ అంతా ఒకటే. అందరు పుష్ప -2 (Pushpa 2) కోసం ఎదురు చూస్తున్నారు’’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిచంద్ర అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మైత్రీ నిర్మాతలతో పాటు దేశవ్యాప్తంగా 'పుష్ప-2' చిత్రాన్ని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అల్లు అర్జున్‌ అభిమానులకు మరో శుభవార్త చెప్పారు. మొదట అనుకున్నట్లు డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 5న పుష్ప 2, ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

420 కోట్లు బిజినెస్‌ చేశాం

నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ "ఈ చిత్రం కోసం బన్నీ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేం. 'పుష్ప-2’కు కూడా నేషనల్‌ అవార్డు వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. అవార్డు కోసం కాదు కానీ నటనలో బెస్ట్‌ ఇవ్వడానికి ప్రతి క్షణం అల్లు అర్జున్‌ కష్టపడ్డారు. రెండోసారి కూడా నేషనల్‌ అవార్డు తీసుకోవడానికి ఆయన అర్హుడు. నాన్‌ థియేట్రికల్‌గా 420 కోట్లు బిజినెస్‌ చేశాం. లాంగ్‌ వీకెండ్‌ కోసం ఒక రోజు ముందు విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్‌లో 4 న షోస్‌ ఉంటాయి.. డిసెంబర్ 5 నుంచి ఇండియాలో ప్రదర్శన చేస్తాం. 'పుష్ప పార్ట్‌-1'కి మించి హిట్‌ అవుతుంది’’ అని అన్నారు.

ఐటెం సాంగ్.. రెండు రోజుల్లో క్లారిటీ

యలమంచిలి రవి మాట్లాడుతూ "యాటిట్యూడ్‌, డైలాగ్స్‌ ప్రధానంగా సాగే సినిమా ఇది. సరైన ఔట్‌ పుట్‌ కోసం టైమ్‌ తీసుకుని సినిమా తెరకెక్కిస్తున్నాం. మొదటి పార్ట్‌లో అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డు రావడంతో బాఽధ్యత మరింత పెరిగింది. రెట్టింపు కసితో హీరో, దర్శకుడు, టీమ్‌ పని చేస్తోంది. పర్ఫెక్షన్‌ కోసం షూటింగ్‌ ఆలస్యం అయింది. రీషూట్‌లు లేవు. జాతర ఎపిసోడ్‌ కోసం 15 రోజులు రిహార్సెల్‌ చేసి,  35 రోజులు షూట్‌ చేశారు. భారీగా ఖర్చుపెట్టాం. అది తెరపై కనిపిస్తుంది. అలాంటి జాతర సన్నివేశం ఇప్పటి దాకా ఏ సినిమాలో చూసి ఉండరు. మాస్టర్‌ పీస్‌ లా ఉంటుంది. ప్రేక్షకులకు రోమాలు నిక్కబోడుస్తాయి. పుష్ప 2  బాహుబలి లా ఉండదు.. ఆడియన్స్‌ ఆశించే అంశాలన్నీ ఉంటాయి. రెండు రోజుల్లో ఐటెమ్‌ సాంగ్‌లో హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారనేది తెలుస్తుంది. ఇంకా చర్చల్లో ఉంది. నవంబర్‌ 4 నుంచి ఆ సాంగ్‌ షూటింగ్‌ చేస్తాం. ఆ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. పుష్ప-3కి కూడా లీడ్‌ ఉంటుంది. ఓవర్సీస్ లో 3200 లొకేషన్స్ లో రిలీజ్ ప్లాన్ చేశాం. నాలుగు నెలల తర్వాత జాపనీస్, స్పానిష్ వంటి భాషల్లో విడుదలపై క్లారిటీ వస్తుంది’’ అని అన్నారు.
 
సుకుమార్‌, అల్లు అర్జున్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కింది. రష్మిక కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.  అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ తెరకెక్కింది.  కూలీగా  ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ తెరకెక్కింది.

Updated Date - Oct 24 , 2024 | 04:49 PM