Pushpa 2: చెప్పిన టైమ్‌కే పుష్పరాజ్ ఆగమనం!
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:25 PM
పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైరు... తగ్గేదేలే’ అంటూ ఐకానస్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌లకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోయింది. అభిమానులు ఊగిపోయారు.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైరు... తగ్గేదేలే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌లకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. బాక్సాఫీస్ కలెక్షన్లతో నిండిపోయింది. అభిమానులు ఊగిపోయారు. ఇప్పుడు అంతకుమించి రెట్టింపు ఉత్సాహం అందించడానికికి అల్లు అర్జున్ అండ్ సుకుమార్ టీమ్ సిద్ధమవుతుంది. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! తొలి భాగం సాధిందిన విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరిగాయి. అదీ కాకుండా ఈ చిత్రానికిగానూ అల్లు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కడం, ఇనేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడిగా ఇదే తొలి పురస్కారం కావడంతో అల్లు అర్జున్ తోపాటు చిత్ర బృందం ఎంతో బాధ్యతతో ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అంతకుమించి అనేలా ఈ చిత్రం కోసం కృషి చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే తాజాగా ఓ రెండుమూడ్రోజుల నుంచి పుష్ప-2 విడుదల వాయిదా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై బన్నీ డిజిటల్ టీమ్ వివరణ కూడా ఇచ్చింది. అనుకున్న సమయానికే పుష్పరాజ్ ర్యాంపేజ్ ఖాయం అని ట్వీట్ చేశారు. తాజాగా సుకుమార్ టీమ్ మరోసారి విడుదల తేదీ విషయంలో స్పష్టతనిచ్చింది. ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయి’’ అని చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పుష్ప-2 విడుదలలో ఎలాంటి మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చినట్టైంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సునీల్, ఫవాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.