Pushpa 2: పుష్ప -2ఈవెంట్ కూడా నార్త్‌లోనే..
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:02 PM
పుష్ప-2 (Pushpa -2) చిత్రం సరిగ్గా నెల రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా 'పుష్ప 2' ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ను బీహార్ పాట్నాలో ఉంటుందని సమాచారం
పుష్ప-2 (Pushpa -2) చిత్రం సరిగ్గా నెల రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా 'పుష్ప 2' ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌ను బీహార్ పాట్నాలో ఉంటుందని సమాచారం. తదుపరి ఉత్తరాదిన పుష్ప 2 సినిమా కోసం ముంబై ఢిల్లీతో పాటు బిహార్ యుపి, పంజాబ్ రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో సైతం అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ సినిమాలకు టీమ్ సభ్యులు దేశవ్యాప్తంగా క్యాంపెన్ చేయగా, ఈ మధ్యన విడుదలైన కల్కి 2898 ఎడీ చిత్రం కోసం కూడా అలాగే ప్రమోషన్స్ చేశారు. సినిమాలోని బుజ్జి వెహికల్‌ను దాదాపు అన్నీ మెయిన్ సిటీస్ లో తిప్పి ప్రమోట్ చేశారు. ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్‌కు దాదాపు నెల రోజులు కేటాయించారు. ఇప్పుడు అదే ఫార్ములాను పుష్ఫ-2 టీమ్ ఫాలో కానుందట. అంతా నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చైన్నై, కొచ్చి లాంటి పెద్ద నగరాల్లో బిగ్ సిటీస్‌లో ఈవెంట్స్ ఉండనున్నాయి. మెయిన్ నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేశారని టాక్. రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్’ టీజర్ ఈవెంట్ కూడా లక్నోలో జరగనుంది. (Puspha 2 promotions from patna)
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తుది దశలో ఉంది. ఇంకా రెండు పాటలు, ఓ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఇందులో ఐటెమ్ సాంగ్ కీలకం. ఆ పాటకు ఇప్పటి దాకా హీరోయిన్ సెట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల అంగీకరించింది అన్న వార్తలు హల్చల్ చేశాయి కానీ.. అధికారిక ప్రకటన లేదు. విడుదల తేదీ దగ్గర పడుతుంది. కానీ ఇంకా పాటల చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. మరి సుకుమార్ ఈ షార్ట్ టైమ్‌లో ఎలా డీల్ చేస్తారో చూడాలి.