Pushpa 2: పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:19 PM
'పుష్ప 2' చివరి క్షణం వరకు షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా మేకర్స్ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ కోసం పుష్ప 2 టీమ్ ఖర్చుచేయబోయే డబ్బుతో మరో పాన్ ఇండియన్ సినిమానే నిర్మించొచ్చు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..
‘పుష్ప ది రూల్’ (Pushpa: The Rule) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్థమయ్యారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu arjun). రష్మిక మందన్నా కథానాయికగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచేందుకు మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ ప్రమోషన్స్ కోసం పుష్ప 2 టీమ్ ఖర్చుచేయబోయే డబ్బుతో మరో పాన్ ఇండియన్ సినిమానే నిర్మించొచ్చు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..
ఈ సినిమా ప్రమోషన్స్ కేవలం నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్'మాత్రమే చూసుకోవడం లేదు. పుష్ప రాజ్ కోసం పలు కార్పొరేట్ సంస్థలు కూడా బరిలోకి దిగాయి. దేశవ్యాప్తంగా పుష్ప సినిమా క్రియేట్ చేసిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకొని 'పుష్ప 2' సినిమాని జోరుగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చుపెట్టనున్నారు. పలు బ్రాండ్లు ఈ సినిమాని ప్రమోట్ చేయనున్నాయి. ప్రతి సిటీలోను పుష్ప హోర్డింగ్స్ కనిపించేలా ప్లాన్ చేశారు. భాషతో సంబంధం లేకుండా ఏ ఛానల్ ఓపెన్ చేసిన పుష్పనే కనిపించనున్నాడు.
ఇక 2021లో రిలీజైన 'పుష్ప' సినిమా కోసం ఎలాంటి ప్రమోషన్స్ చేయని విషయం తెలిసిందే. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే నార్త్ మార్కెట్‌ని కూడా షేక్ చేసిన క్రెడిట్ ఆ సినిమాకే చెందుతుంది. అయితే 'పుష్ప 2' చివరి క్షణం వరకు షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా మేకర్స్ ఇలా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్‌లో మాసివ్‌గా నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ‘పుష్ప-2 ది రూల్’ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను ఈ నెల 17న బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలింగా పాట్నాలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. 17 నవంబర్ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.