Puri Jagannadh: ఇన్ని రకాల కర్మలా పూరి!
ABN, Publish Date - May 06 , 2024 | 04:03 PM
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో రోజుకో కొత్త విషయాన్ని చెబుతున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. కొంతగ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు రెగ్యులర్‌గా యూట్యూబ్ వేదికగా ఆసక్తికర అంశాలు చెబుతుంటారు. తాజాగా.. ‘కర్మ’పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musing) పేరుతో రోజుకో కొత్త విషయాన్ని చెబుతున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. కొంతగ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు రెగ్యులర్‌గా యూట్యూబ్ వేదికగా ఆసక్తికర అంశాలు చెబుతుంటారు. తాజాగా.. ‘కర్మ’పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘కర్మ (musing on Karma) అంటే ఏంటి? దాని వెనుకున్న అంతరార్థం ఏంటి? అని ఆలోచిస్తుంటాం. అదేం పెద్ద థియరీ కాదు. కర్మను ఒక్క మాటలో వివరించాలంటే.. ఈ రోజు నాసిరక ఆహారం తింటే రేపటికి కడుపు అప్‌సెట్ అవుతుంది. అదే కర్మ(Puri Jagannadh). మనం చేేస ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’.
ఇందులో మొదటి రకం: ఇన్‌స్టంట్ కర్మ. వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా అరటిపండు తొక్కను రోడ్డుపై పడేస్తే ఎవరో తొక్కి కిందపడిపోతారు. దాన్ని చూసి నవ్వుకుంటూ నువ్వెళ్లి ఓ స్తంభాన్ని ఢీ కొడతావ్. ‘క్యూ’లో నిల్చోవాలంటే నీకు చిరాకు. వరుస క్రమంలో ఉన్న అందరినీ నెట్టుకుంటూ వెళ్లి ‘ స్టార్ బక్స్’లో కాఫీ తీసుకొస్తావ్. కానీ, ఆ కప్పు చేజారి కిందపడిపోతుంది.
‘కర్మ ఇన్ మీడియా’ అనేది మరో రకం. సోషల్ మీడియాలో ఓ నెగెటివ్ పోస్ట్ పెడతాం. లక్షల మంది మనల్ని తిడతారు’’
‘‘మూడో రకం.. ‘కార్మిక్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్’. మనం చేేస ప్రతి కర్మకు డెబిట్స్, క్రెడిట్స్ ఉంటాయి. కర్మ స్థాయిని బట్టి అవి మన ఖాతాలో ఆటోమేటిక్‌గా పడిపోతాయి. అవి వెంటనే కనిపించవు. మెల్లగా పోగవుతూ ఉంటాయి. అలా ఏదో ఒక రోజు నీ సిబిల్ స్కోర్ చూేస్త జాతకం మొత్తం బయటపడుతుంది. అందుకే మనల్ని మోసం చేసినవాడు ఎక్కడికీ పోడు. ఇక్కడే దొరుకుతాడు. దానికి సమయం పడుతుందంతే’’
‘‘నాలుగో రకం.. ‘డాడ్జింగ్ కర్మ’. మనం ఏ కర్మ చేయకుండా ఉండలేం. అందుకే చేేసదేదో మంచి చేయాలి. ఒక్కోసారి దాని ఫలితాన్ని తక్షణమే చూడలేకపోవచ్చు. అవినీతికి పాల్పడితే అధికారులకు పట్టుబడతాం. హత్య చేస్తే ఏదో ఒక రోజు జైలుకెళ్తాం. ‘చెడ్డ పని చేసి భలే తప్పించుకున్నాం’ అని ఎప్పుడూ అనుకోవద్దు.
ఐదో రకం: ‘పాస్ట్ లైఫ్ కర్మ’. గత జన్మలో ఏం చేశామో మనకు తెలియదు. అప్పటి తప్పులు ఇప్పుడు ప్రభావం చూపుతాయో లేదో కూడా తెలియదు. అందుకే ఈ లైఫ్‌లో జాగ్రత్తగా ఉన్నా చాలు. నెక్ట్స్ టైమ్ తప్పు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి. కర్మ ఈజ్ బూమరాంగ్, కర్మకి గుర్తు ఎక్కువ’’ అని పూరి తన మ్యూజింగ్‌లో చెప్పుకొచ్చారు.