Talwar: ఆకాష్ జగన్నాథ్ కొత్త సినిమా తల్వార్

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:02 PM

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ హీరోగా తెరకెక్కనున్న 'తల్వార్' చిత్రం సోమవారం  హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ (Akash Jaganath) హీరోగా తెరకెక్కనున్న 'తల్వార్' (Thalwar) చిత్రం సోమవారం  హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ (Kaasi Parasuram)రూపొందిస్తున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సానా  ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ - విఠల్, ఎడిటర్ - ఐల శ్రీనివాసరావు, సినిమాటోగ్రఫీ - త్రిలోక్ సిద్ధు, మ్యూజిక్ డైరెక్టర్ - కేశవ కిరణ్

Updated Date - Aug 19 , 2024 | 04:02 PM