Movie Tickets Price: రూ. 1500 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాను చూడలేదా?.. సురేష్ బాబు ఏమన్నారంటే..
ABN, Publish Date - Oct 16 , 2024 | 02:45 PM
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూవీ టికెట్ల ధరలపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. పండగైనా, పెద్ద హీరో సినిమా ఏదైనా విడుదల అవుతున్నా.. టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రేక్షకులు చాలా వరకు థియేటర్లకు రావడం మానేశారు. అదేంటని అడిగితే.. నిర్మాత నాగవంశీ ఒకలా రియాక్ట్ అయితే.. సీనియర్ నిర్మాత సురేష్ బాబు మరోలా మాట్లాడారు. వారి మాటలేంటో తెలుసుకుందామా..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూవీ టికెట్ల ధరలపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. పండగైనా, పెద్ద హీరో సినిమా ఏదైనా విడుదల అవుతున్నా.. టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రేక్షకులు చాలా వరకు థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలలో నాలుగు వారాలలో వచ్చేస్తుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆచితూచి మాట్లాడాలి కానీ.. టాలీవుడ్ యంగ్ నిర్మాత నాగవంశీ కాస్త అగ్రెసివ్‌గా మాట్లాడి.. నెటిజన్లతో ట్రోల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ‘రూ. 1500 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాను చూడలేరా.. మూడు గంటల పాటు ఎవరిస్తారు ఎంటర్టైన్మెంట్’ అనటంపై సోషల్ మీడియాలో నానా రచ్చ, చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై డిఫరెంట్ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లపై సీనియర్ నిర్మాతల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది.
Also Read- Akhanda 2: బాలయ్య పెద్ద కుమార్తె క్లాప్.. చిన్న కుమార్తె స్విచ్ఛాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ కలిసి టాలీవుడ్‌లో ఓటీటీలతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలనే సలహాను ఇవ్వగా.. మరో సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా టికెట్ల ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ చర్చా కార్యక్రమంలో టికెట్ల ధరలపై మాట్లాడారు. అంతకు ముందు కూడా టికెట్ల ధరలపై తన స్టాండ్ ఏమిటో ఆయన చెబుతూనే వస్తున్నారు.
ఆడియన్స్‌కు మంచి సినిమాలను ఇవ్వటంతో పాటు, వాటి టికెట్ల ధరలు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలంటూ కొన్ని రోజులుగా ఆయన ప్రతి వేదికపై చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన పాల్గొన్న చర్చా వేదికపై సైతం టికెట్ల రేట్లను పెంచడం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న మాట వాస్తవమని.. భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు అదనపు రేట్లు పెడితే తప్ప తాము సేఫ్ అవ్వలేమని ఆలోచిస్తున్నారని.. ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తోందని.. కానీ ప్రేక్షకుల దృష్టికోణం వేరుగా ఉందని సురేష్ బాబు అన్నారు.
Also Read- Rajinikanth: 'రజినీ' ఇంట్లో వరద బీభత్సం
ఎక్కువ రేటు పెట్టి థియేటర్లకు వెళ్లాలా అని అడియన్స్ ఆలోచిస్తున్నారన్నారు. టికెట్ల రేట్లతో పాటు పాప్ కార్న్ సహా స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నట్లు ఆడియన్స్ ఫీలవుతున్నారు. పైగా చాలాసార్లు బుకింగ్ యాప్స్‌లో టికెట్లు బుకింగ్ కాకుండా నేరుగా థియేటర్లకు వెళ్లి కౌంటర్లో కొంటున్న సంగతిని మేము గుర్తించాము. అంటే, బుకింగ్ కోసం పెట్టే డబ్బును కూడా వేస్ట్ అని ప్రేక్షకుల ఫీలవుతున్నారు. ఫెస్టివల్ సీజన్‌లో స్టార్ హీరోల సినిమాలు వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. చాలా సినిమాలకు నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో ఫ్రీగా చూసుకోవచ్చనే భావనలో ఆడియన్స్ ఉన్నారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో పునరాలోచించాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు..