SKN: టికెట్ రేట్లు ఎంత పెరిగినా.. నిర్మాత‌కు వ‌చ్చేది ఇంతే! నాగ‌వంశీ కామెంట్స్‌కు SKN వివ‌ర‌ణ‌

ABN, Publish Date - Oct 14 , 2024 | 05:58 PM

తాజాగా నిర్మాత, సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నాగ‌వంశీ ఓ మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు బాగా వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో మ‌రో నిర్మాత SKN స్పందిస్తూ నాగ‌వంశీ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు.

skn

ఇండియాలో సినిమాల ద్వారానే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంద‌ని..కేవలం రూ.1500 ఉంటే ఫ్యామిలీ మొత్తం 3 గంటల వినోదాన్ని పొందవచ్చని తాజాగా నిర్మాత, సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నాగ‌వంశీ ఓ మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్యాలు బాగా వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో మ‌రో నిర్మాత SKN స్పందిస్తూ నాగ‌వంశీ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు.ఇడ్లీ.. బండి దగ్గర రూ.20కి దొరుకుతుంది. అదే స్టార్ హోటల్లో రూ.200 ఛార్జ్ చేస్తారు. ఎక్కడ తినాలనేది మన వ్యక్తిగతం. మనం కోరుకునే సౌకర్యాన్ని బట్టి, డబ్బులు చెల్లిస్తుంటాం. అదేవిధంగా 'రూ.300 పెట్టి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలా' అని అనుకునే వారు సింగిల్ స్క్రీన్లో చూడొచ్చు. నేను చాలా సినిమాలు సింగిల్ స్క్రీన్లోనే చూస్తా. ఆ అనుభూతి వేరుగా ఉంటుంది.

టికెట్ రేట్లపై ఒక అపోహ ఉంది. పెంచిన టికెట్ రేట్ల డబ్బులు నిర్మాతకే వస్తాయని అనుకుంటారు. కానీ రూ.1500 ఖర్చు పెడితే, ఆ మొత్తం నిర్మాతకు రావు. అందులో 28శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 50-60 శాతం ఎగ్జిబిటర్లు, థియేటర్స్ నడిపేవాళ్లకు వెళ్తుంది. మిగిలిన దానిలో 30-35శాతం నిర్మాత జేబులోకి వస్తుందన్నారు. బడ్జెట్ను బట్టి, ప్రపంచంలో ప్రతి వస్తువుకు ధర నిర్ణయించుకునే సౌలభ్యం దాన్ని తయారు చేసిన వాడికి ఉంది. అంత ధర పెట్టి మనం కొనాలా వద్దా అన్నది వినియోగదారుడి ఇష్టం. బహుశా ఈ విషయంలో నాగవంశీని ఒకటికి రెండు సార్లు ప్రశ్నించడంతో అలా సమాధానం చెప్పి ఉండవచ్చు". సినిమాకు వచ్చే ఆడియెన్స్ ఒక వినియోదారుడిలా చూడకూడదు. సినిమా మనకు ఒక వ్యాపకం.. జ్ఞాపకం.. మన జీవితంలో భాగం.


చాలా విషయాలు దాని నుంచే ఫాలో అవుతాం. కొత్తగా ఓ అమ్మాయి పరిచయమైతే, సినిమాకు తీసుకెళ్తాం.. మనసు బాగలేకపోతే సినిమాకు వెళ్తాం.. మజా చేయాలంటే కూడా సినిమానే మంచి ఆఫ్స‌న్‌. ఇలా మనతో మమేకమైన సినిమాను 'తక్కువ ధరకే ఇవ్వు' అనే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. పెట్రోల్, బంగారం రేటు పెరిగినట్లే టికెట్ ధరలూ పెరిగాయి. కాబట్టి తక్కువకు ఇవ్వలేమని నిర్మాతలు చెప్పొచ్చు. అంతే తప్ప, ఒకరి జేబుల్లో నుంచి తీసుకుందామనే ఆలోచన నిర్మాతలకు లేదు. రియల్ ఎస్టేట్ పెరిగి అద్దెలు పెరిగాయి. పంజాగుట్ట, అమీర్పేట చాలా బిజీ ప్రాంతాలు. అక్కడ థియేటర్ కట్టి అన్నీ ఇస్తున్నాడంటే రేట్లు కూడా అలాగే ఉంటాయి. నాగవంశీ చెప్పినట్లు ఇది నిజంగా తక్కువ ధరకు లభించే వినోదమో కాదో నాకు తెలియదు కానీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో సినిమా ఒకటని తెలిపారు.

Updated Date - Oct 14 , 2024 | 05:58 PM