Ram Talluri: పవర్‌స్టార్, మెగా ప్రిన్స్‌లకు 100 శాతం మ్యాచింగ్ ఉంది
ABN, Publish Date - Nov 11 , 2024 | 09:31 AM
వరుణ్ తేజ్ చాలా కూల్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారికి వరుణ్ బాబు గారికి 100% మ్యాచింగ్ ఉంది. మట్కా తర్వాత వరుణ్ తేజ్ గారు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ మాస్ హీరో ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ అవుతారని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానులు సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విజయేందర్ రెడ్డి గారితో కలిసి సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారు చాలా కూల్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారికి వరుణ్ బాబు గారికి 100% మ్యాచింగ్ ఉంది. మట్కా తర్వాత వరుణ్ తేజ్ గారు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ మాస్ హీరో ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ అవుతారు. ఇందులో వరుణ్ తేజ్ గారి పెర్ఫామెన్స్ చూసాను. మార్కెట్లో ఫైట్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. వైజాగ్ ని రీ క్రియేట్ చేశారు. దాని వెనక చాలా కృషి ఉంది. డైరెక్టర్ గారు ఎంతో రీసెర్చ్ చేసి కథను రాసుకున్నారు. టీం చేసిన హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా నవంబర్ 14 ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ వేడుకకి విచ్చేసిన లావణ్య గారికి థాంక్యూ సో మచ్' అన్నారు
నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో జరిగిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హాయ్ నాన్నకి వైజాగ్ వచ్చాము. మీరు గొప్పగా ఆదరించారు. మట్కా సినిమా నిన్ననే చూశాను. వరుణ్ తేజ్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. మెగా ఫాన్స్ తొడగొట్టి చెప్పొచ్చు. వాసు క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండిపోతుంది. కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. మనసుపెట్టి ఈ సినిమాని చేశారు, నోరా, మీనాక్షి, మిగతా యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ థాంక్ యూ. ప్రేక్షకులు నవంబర్ 14న ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.