Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌పై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 13 , 2024 | 11:12 AM

‘దేవర’ మూవీ కలెక్షన్స్‌పై మరో మారు రచ్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి.. మేకర్స్ అనౌన్స్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌పై రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ ‘దేవర’ కలెక్షన్స్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ నాగవంశీ ఏమన్నారంటే..

Producer Naga Vamsi on Devara Collections

ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన దేవర (Devara) సినిమా కలెక్షన్స్ పై తొలినుంచి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జెన్యూన్‌గా వచ్చిన వసూళ్లు.. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చూపినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ వర్గం అభిమానులు, ‘దేవర’వి ఫేక్ వసూళ్లు (Devara Fake Collections) అంటూ అనేక ఆరోపణలను తెరమీదకి తెచ్చారు. ఇప్పుడీ ఈ ఫేక్ కలెక్షన్స్‌పై నిర్మాత నాగవంశీ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?

తాజాగా జరిగిన ‘లక్కీ భాస్కర్’ మీడియా సమావేశంలో ‘దేవర’ సినిమా కలెక్షన్స్ పై నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. ‘దేవర’కు మేము చెప్పిన‌ కలెక్షన్స్‌ను ఎవరైనా నమ్మకపోతే అది మా తప్పుకాదు. కలెక్షన్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడం కేవలం‌ అభిమానుల కోసమే. స్టార్ హీరోల అభిమానులను సంతృప్తి పరచటానికే అలా కలెక్షన్స్ విడుదల చేస్తుంటాం. గ్రాస్, షేర్ కలెక్షన్లకు ఉన్న తేడా ఏంటో ఇన్కమ్ టాక్స్ వాళ్లకు బాగా తెలుసంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు. అంటే.. ఓ విధంగా కలెక్షన్ల రిపోర్ట్ అనేది కరెక్ట్ కాదు..‌ అందరు చేస్తున్నదే కదా.. మేము కూడా చేసింది అనేట్టుగానే నాగవంశీ కామెంట్స్ ఉన్నాయి. దీంతో ‘దేవర’ టార్గెట్‌గా సోషల్ మీడియాలో నాగవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Devara-Daavudi-Song.jpg

స్వయానా ‘దేవర’ డిస్ట్రిబ్యూటరే కలెక్షన్స్ ఫేక్ అని చెప్పినా సరే.. ఇంకా ‘దేవర’ని హిట్ అని ఎలా అనుకుంటున్నారు అంటూ యాంటీ ఫ్యాన్స్ చర్చ మొదలెట్టారు. ‘దేవర’ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నాగ వంశీ చెప్పినా.. వసూళ్లపై అతను చేసిన కామెంట్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 11:12 AM

Devara Review: తారక్ నటించిన 'దేవర' ఎలా ఉందంటే

Devara Trailer: దేవర.. మరో ఆచార్య! నెట్టింట రచ్చ ర‌చ్చ‌

Devara Fear Song: అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండే ఆకశం’

Devara : సూపర్‌ ఎలివేషన్స్‌తో ‘ఫియర్‌’

Devara Release Trailer: సంద్రం ఎరుపెక్కి ఎర్ర సముద్రం అయినట్టు...