SSMB29 - KL Narayana: హాలీవుడ్ ఆఫర్ వచ్చినా.. మాటకు కట్టుబడి నాకోసం..
ABN, Publish Date - May 02 , 2024 | 12:51 PM
నిర్మాత కె.ఎల్ నారాయణ వేదికలపై మాట్లాడటం అరుదు. తన సినిమా గురించి కూడా పెద్దగా మాట్లాడరు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా 'ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత కె.ఎల్ నారాయణ (Produce Kl Narayana) వేదికలపై మాట్లాడటం అరుదు. తన సినిమా గురించి కూడా పెద్దగా మాట్లాడరు. ప్రస్తుతం ఆయన రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మహేష్‌బాబు(Mahesh Babu) హీరోగా 'ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29)చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హలో బ్రదర్’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సంతోషం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో మహేష్, రాజమౌళి కలయికలో భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నాం అని వెల్లడించారు కానీ అంతకుమించి ఆ సినిమా గురించి ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఆయన ఓ వేదికపై రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని నిర్మాత కె.ఎల్. నారాయణ అన్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రాన్ని వాళ్లే స్వయంగా ప్రకటించి, పనిపై ఉన్న నిబద్థతను చాటారని కొనియాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్మాతగా విరామం తీసుకోలేదన్నారు.
"రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్ సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్ చేశాం. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్ మరో స్థాయిలో ఉంది. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో మూవీ తీయనున్నట్లు వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్ నుంచీ ఆఫర్లు వచ్చాయి. వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నిర్మాతలు కథా చర్చల్లో పాల్గొనరు అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తుంటుంది. అది అందరి విషయంలో నిజం కాదు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారు. పేపర్ వర్క్ చేస్తున్నప్పుడే క్లారిటీ ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఏమైనా సందేహం ఉంటే చెప్పమని అడుగుతారు. చిన్న పాయింట్‌నీ కూడా ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గర ఉండి గమనించా. పాత్రకు తగ్గట్టు మహేశ్ తనని తాను మలుచుకుంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేసుకున్నాం. స్టోరీ బాగుంది. బడ్జెట్‌ని ఇంకా డిసైడ్ చేయలేదు. ప్రొడక్టుకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్థంగా ఉన్నాం’’ అని అన్నారు.
Jr NTR: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ లేటెస్ట్ అప్‌డేట్!
Read More: Tollywood, Cinema News