Allu Arjun: ఆ రోజు అల్లు అర్జున్ లేకుంటే.. ఇప్పుడు నేను ఉండేవాడిని కాదు

ABN, Publish Date - Aug 14 , 2024 | 01:32 PM

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్‌అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. తాజాగా ఆయ‌న నిర్మించిన ‘ఆయ్‌’ చిత్రం మా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో త‌న‌ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.

allu arjun

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్‌ (Allu Arjun) అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) స్ప‌ష్టం చేశారు. నార్నే నితిన్ (Nithin Narne), నయన్‌ సారిక (Nayansarika) జంటగా నటించిన చిత్రం ‘ఆయ్‌’(Aay). ఈ నెల 15న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు (Bunny Vas), విద్యా కొప్పినీడి (VidyaKoppineedi) నిర్మించారు. అంజి కె. మణిపుత్ర (AnjiK Maniputhra) దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా బ‌న్నీ వాసు (Bunny Vas) మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌(Allu Arjun)తో త‌న‌ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయ్‌ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని సినిమా గురించి పోస్ట్‌ చెయమని అడగాలని మా టీమ్‌ నన్ను కోరారని.. కానీ మేము అడగకుండానే బన్నీ మా‌ ఈ చిత్రం గురించి ట్వీట్ పోస్ట్‌ చేశారన్నారు. అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారని.. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని ఆలోచించే ఏకైక వ్యక్తి అల్లు అర్జునే అని అన్నారు.


20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్ (Geetha Arts) నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఆరోజు బన్నీ నాకు సపోర్ట్‌ చేయడం కోసం వాళ్ల నాన్నగారిని కూడా ఎదిరించారు. ఆయన సపోర్ట్‌ లేకుంటే ఈరోజు ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. స్నేహితుల్లో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సపోర్ట్‌ చేస్తారు. అల్లు అర్జున్ మంచి వ్యక్తి అని బన్నీ వాసు (Bunny Vas) తెలిపాడు. కాగా ఇటీవ‌ల ఏపీ ఎన్నికల స‌మ‌యంలోనూ తన స్నేహితుడికి అల్లు అర్జున్ తన సపోర్ట్ తెలిపి వివాదాల పాలైన విషయం తెలిసిందే.

Updated Date - Aug 14 , 2024 | 01:32 PM