Srikakulam Sherlockholmes: 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ..ప్రేమించానే పిల్లా సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:26 AM

వెన్నెల కిషోర్ , అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేమించానే పిల్లా పాట‌ను రిలీజ్ చేశారు.

Srikakulam Sherlock holmes

వెన్నెల కిషోర్ (Vennela Kishore), అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ (Writer Mohan) దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlockholmes). శ్రీగణపతి సినిమాస్ (Sri Ganapathi Cinemas) బ్యానర్ పై లాస్య రెడ్డి (Lasya Reddy Presents) సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి (Vennapusa Ramana Reddy) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది..

తాజాగా మేకర్స్ ప్రేమించానే పిల్లా ( Preminchane Pilla) సాంగ్ ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ (Sunil Kasyap) ఈ సాంగ్ క్యాచి బీట్స్ తో లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి (Purnachary) ఆకట్టుకునే లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) హై ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఎట్రాక్షన్ ని తీసుకొచ్చాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.


ఈ చిత్రానికి మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

Updated Date - Jul 07 , 2024 | 09:26 AM