Mamitha Baiju: మమితా బైజు.. కుర్రకారుకు ఎందుకింత మోజు
ABN, Publish Date - Apr 11 , 2024 | 06:14 PM
మమితా బైజు ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా వినిపిస్తోన్న పేరు. ఏ సోషల్ మీడియా చూసినా అమెకు సంబంధించిన ఫొటోనో, వీడియోనో మనకు కనిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు.
మమితా బైజు (Mamitha Baiju) ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా వినిపిస్తోన్న పేరు. ఏ సోషల్ మీడియా చూసినా అమెకు సంబంధించిన ఫొటోనో, వీడియోనో మనకు కనిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు.
అంతలా ఈ మలయాళ కుట్టి ఒక్క ప్రేమలు సినిమాతో ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. 2017లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పటి వరకు ఓ 18 సినిమాలు చేసింది.
అందులో 2021లో వచ్చిన అపరేషన్ జావా (Operation Java), ఖో ఖో (Kho Kho), 2022లో సూపర్ శరణ్య (Super Sharanya), 2023లో ప్రణయ విలాసం (Pranaya Vilasam) వంటి సినిమాలతో నటిగా గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ప్రేమలు (Premalu) సినిమాతో జాతీయంగా పేరు తెచ్చుకోవడమే కాక స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
ఆ సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఆ ఇండస్ట్రీలలోనూ తన పేరు వినిపించేలా చేసుకుంది. దీంతో అమ్మడికి సినిమా ఆఫర్లు వరుసబెట్టి క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ సరసన రెబల్ (Rebel) అనే చిత్రంలో నటించగా.. తాజాగా తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చూడాలి తెలుగు నాట అమ్మడి రాత ఎలా ఉంటుందో. గతంలో తళుకున్న మెరిసి మాయమైన ప్రియా ప్రకాశ్ వారియర్‌లా అవుతందో.. లేక సాయి పల్లవిలా స్టార్ డం తెచ్చుకుంటుందో చూడాలి.
ఎక్కువ సాంప్రదాయ దుస్తులకే ఆసక్తి చూపే ఈ భామ అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటుంది కానీ హద్దులు దాటని లేటెస్ట్, ట్రెండింగ్, ఫ్యాషన్ దుస్తులను మాత్రం ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తుంటుంది.
కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇప్పటికీ బాగా వైరల్ అవుతున్నాయి.