Prasanth Varma: టామ్ క్రూజ్ వచ్చినా.. నేనింతే!
ABN, Publish Date - Jan 28 , 2024 | 02:13 PM
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే తనకెంతో ఇష్టమని హనుమాన్ (Hanuman)చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు పశాంత్ వర్మ (Prasanth varma) అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) అంటే తనకెంతో ఇష్టమని హనుమాన్ (Hanuman)చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు పశాంత్ వర్మ (Prasanth varma) అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘‘రాజమౌళిగారి టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఆయన మేకింగ్ స్టైల్ నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించా. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే.. ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించా. నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. టీమ్‌లో ఖాళీ లేదని చెప్పారు. హార్డ్‌వర్క్, టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని తెలిపారు. అంతే కాదు ‘‘పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదని చెప్పారు. వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది. డేట్స్ కోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా’ అని ప్రశాంత్ చెప్పారు. అలాగే ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు నచ్చలేదని చెప్పిన ఆయన ఆ సన్నివేశాలను తాను అయితే ఎంతో చక్కగా తీర్చిదిద్దేవాడినని చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.