Prakash Raj: ప్రకాష్ రాజ్‌కి తారక్ అంటే ఇంత ఇష్టమా..
ABN, Publish Date - Oct 05 , 2024 | 02:33 PM
తారక్ నటన సామర్థ్యం, ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన పొందిన అవార్డులు, విమర్శకుల ప్రశంసలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీనికి తోడు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ దేవర సక్సెస్ మీట్లో తారక్‌పై చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) నటన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతీయ సినీ ఇండస్ట్రీలోనే ఆయన గొప్ప నటుడిగా లెజెండ్ స్థాయి గుర్తింపు పొందారు. ఇటీవల రిలీజైన 'దేవర'(Devara) సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో సింగప్పగా నటించిన ప్రకాష్ రాజ్ తారక్(NTR) గురించి హృదయాల్ని హద్దుకునేలా మాట్లాడారు.
తారక్ నటన సామర్థ్యం, ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన పొందిన అవార్డులు, విమర్శకుల ప్రశంసలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీనికి తోడు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ దేవర సక్సెస్ మీట్లో తారక్‌పై చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. ఆయన మాట్లాడుతూ " తారక్ మీద నాకెంత ప్రేమంటే.. అది ఎవరికీ చెప్పలేదు. తారక్‌తో కూడా చెప్పుకోలేదు. ఆ మధ్య ఆస్కార్ అవార్డుల వేడుక కోసం వెళ్లినపుడు అక్కడ అంతమంది గొప్ప గొప్ప నటుల ముందు నిలుచుని తారక్ మాట్లాడుతుంటే.. ఇంట్లో కూర్చుని వీడియో చూశాను. అప్పుడు నేనెంత గర్వించానో మాటల్లో చెప్పలేను" అంటూ ప్రారంభించాడు. టాలీవుడ్‌లో తనకు ఎంతోమంది అభిమాన నటులున్న ఎన్టీయారే తన అల్ టైమ్ ఫెవరెట్ యాక్టర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే కొరటాల( Koratala Siva) డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తారక్ అండగా నిలిచినా తీరు అభినందనీయం అన్నారు.
Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి
కన్నడ ఇండస్ట్రీ ద్వారా పరిచయమైనా ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదు అంటే ఎవ్వరు నమ్మలేకపోయారు. అలాంటి భాష పరిజ్ఞానం, నేటివిటీకి తగిన నటన సామర్ధ్యాలు ఆయన సొంతం. కేవలం నటుడిగానే కాకుండా దర్శక రచయితగాను తెలుగు వారు ఆయనకు మంచి మార్కులు వేశారు. కేవలం దక్షిణ భాషల్లోనే కాకుండా ఆయన నార్త్‌లోను ప్రత్యేకమైన మార్క్ వేశారు. కానీ.. ఆయన రాజకీయ అభిప్రాయాలపై మెజారిటీ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్‌పై ఆయన చేసిన ట్వీట్ల దాడితో ఫ్యాన్స్ భగ్గుమంటున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సరే ఒకే స్టాండ్‌పై నిలబడే మనుషులు చాలా అరుదు.. అలాంటి అరుదైన మనుషుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు.
Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి